నువ్వు లేని నా ఈ
గీతం లొ
శ్రుతి వుంది,
లయ వుంది, భావమూ వుంది
మరి లేనిదేమిటి?
ఆప్పుడప్పుదు తొంగి
చూసే నీ వూపిరి
నా ఎదొలోనే వుంది,
ఇదిగో ఇక్కడే
నీ స్పర్శ గుర్తుల్లొ,
నీ చూపుల సెగల్లొ
నువ్వు నడిచిన ఈ లొగిలిలొఇదిగొ ఇక్కడే
ఆగి పొయిన నా ఈ జీవనం;
ఇక్కదె వుందె,
మరి లేనిదేమిటి?